పెద్దపల్లి, అర్జున్ సమాచారo,జూలై 15 : జిల్లా న్యాయ సేవల సంస్థ (DLSA), పెద్దపల్లి ఆధ్వర్యంలో NALSA – SAMVAD (Strengthening Access to Justice for Marginalized, Vulnerable Adivasis and Denotified/Nomadic Tribes) Scheme, 2025 కింద ఏర్పాటు చేసిన “మనోన్యాయ్ (SAMVAD)” ప్రత్యేక న్యాయ సేవల యూనిట్కు అడ్వొకేట్ రాజు కార్తిక్ ప్యానెల్ లాయర్‌గా ఎంపికయ్యారు.
ఈ నియామకం ద్వారా అట్టడుగు వర్గాలు, ఆదివాసీలు, సంచార మరియు విముక్త జాతులు (Denotified & Nomadic Tribes), అలాగే ఇతర బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, అవగాహన కార్యక్రమాలు, న్యాయ సేవలు మరింత సమర్థవంతంగా అందించనున్నారు.
ఈ సందర్భంగా అడ్వొకేట్ రాజు కార్తిక్ మాట్లాడుతూ, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయం చేరేలా పూర్తి నిబద్ధతతో సేవలందిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన జిల్లా న్యాయ సేవల సంస్థ (DLSA), పెద్దపల్లి అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఎంపిక పట్ల న్యాయవాదులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.